'తెలంగాణ రైతులకు ఏపీ ఇబ్బందులు'
నల్లగొండ: పులించితల ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే ఎవరికి మంచిది కాదన్నారు. నిబంధనల ప్రకారం పులిచింతలలో 4 టీఎంసీలను నిల్వ చేసి లిఫ్ట్‌ల కింద ఉన్న ఆయకట్టుకు నిర్భందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ఈ సారి నల్లగొండకు రైల్వే కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. ప్రతిసారి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఈ సారైన బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.