మిర్యాలగూడ : కేన్సర్‌ను మొదట్లోనే గుర్తించి చికిత్స నిర్వహిస్తే నయమవుతుందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో లయన్స్ క్లబ్ భాస్కర ఆధ్వర్యంలో దాచేపల్లి స్వరాజ్యం జ్ఞాపకార్థం ఆమె భర్త రామనారాయణ నిర్వహించిన ఉచిత కేన్సర్ నిర్ధారణ పరీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ మొదట్లోనే గుర్తించకుండా అజాగ్రత్త వహిస్తే వ్యాధి ముదురుతుందన్నారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ వల్ల కేన్సర్ జబ్బులు నయమవుతున్నాయని తెలిపారు. జిల్లాలో తొమ్మిది ఏరియా ఆస్పత్రులు, 74 పీహెచ్‌సీలు, 734 సబ్ సెంటర్లు ఉన్నాయన్నారు. అయినా కూడా ప్రసూతికోసం ప్రతి వంద మందిలో 77 మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, వారిలో 95 శాతం మందికి ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు.
డాక్టర్లు కూడా అన్ని వర్గాల ప్రజలను ఆలోచించి వైద్యం అందించాలని సూచిం చారు. పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, మరిన్ని మెరుగైన వసతులు కల్పించడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన కామినేని ఆస్పత్రి డాక్టర్లను, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీ భార్గవ్, లయన్స్ క్లబ్ భాస్కర అధ్యక్షుడు గుండా లక్ష్మీకాంతం గుప్త, ఎంపీపీ జానయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు మెరుగు రోశయ్య, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, లయన్స్ క్లబ్ సభ్యులు కర్నాటి రమేష్, భుజంగరావు, మాలి విజయపాల్‌రెడ్డి, ఏచూరి మురహరి, మామిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాగయ్య, డాక్టర్ రాజు, కాంగ్రెస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కరీం, మగ్దూమ్‌పాష, ఉదయ్‌భాస్కర్‌గౌడ్, సైదులుబాబు తదితరులు పాల్గొన్నారు.
కేనర్స్‌ను మొదట్లోనే గుర్తించాలి : గుత్తా
Published Thu, Nov 6 2014 4:17 AM | Last Updated on Fri, Oct 19 2018 7:57 PM
Advertisement