వెల్లంపల్లి నిర్వాసిత గ్రామం
కుదరని గూడు.. తీరని ‘చింత’!
Published Sat, Sep 3 2016 10:47 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
* ఇదీ పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల పరిస్థితి
* వెల్లంపల్లిలో 92 వుందికి వుంజూరు కాని ఇళ్లు
* ఇళ్లు మంజూరవుతాయో లేదోనని నిర్వాసితుల ఆందోళన
* తేలని అసైన్డ్‌భూమి వ్యవహారం
పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల గోడు ఎవ్వరికీ పట్టడంలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేపట్టి నీటిని నిల్వ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీన వైఖరి వెరసి నిర్వాసితులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గూడు అందక.. పరిహారం పొందక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
మాచవరం: మండలంలో పులిచింతల ముంపు గ్రామాలైన రేగులగడ్డ, వెల్లంపల్లి, వేమవరం, గోవిందాపురం గ్రామాల ప్రజల సమస్యలు తీర్చే నాథుడే కరువయ్యాడు. అధికారులు, పాలకులు వచ్చినప్పుడల్లా అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పడమే కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయారు.
వెల్లంపల్లి గ్రావుంలో..
వెల్లంపల్లి వాసులకు బ్రాహ్మణపల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద స్థలాలు కేటాయించారు. గ్రామంలోని మొత్తం 417 మందిని అర్హులుగా గుర్తించి ఇళ్ల ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. అయితే 230 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలిచ్చారు. ఇంకా 92 మందికి ఇళ్ల పట్టాలు అందించాల్సిఉంది. స్కూళ్లకు, దేవాలయాలకు మిగిలిన ప్లాట్లు కేటాయించాల్సిఉంది. ఈ 92 వుందికి సంబంధించి రీసర్వే, 15 ఏళ్ల క్రితం గ్రావుంలో నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపాలంటున్నారు. వాటి ద్వారానే అర్హత గుర్తిస్తావుని అధికారులు చెబుతుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రేగులగడ్డలో..
రేగులగడ్డ గ్రామానికి బ్రాహ్మణపల్లి సమీపంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూములను కొనుగోలు చేయగా, భూ యజమానులు తమ భూమికి ఇచ్చే ధర గిట్టుబాటు కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదు. నిర్వాసితులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వాధికారులు ముందుకొచ్చి, విడతల వారీగా లబ్ధిదారులకు చెక్కులను అందిస్తున్నారు. రేగులగడ్డ గ్రావుంలో మెుత్తం 603 వుంది అర్హులు ఉండగా, 416 వుందికి చెక్కులు ఇవ్వగా, మిగిలిన 187 వుందికి పరిహారం అందాల్సి ఉంది.
వేవువరంలో..
వేమవరంలో ఎస్సీ కాలనీలో 112 వుందిని నిర్వాసితులుగా గుర్తించారు. వారిలో 98 వుందికి గ్రామ శివారులో ఇళ్లు కేటాయించారు. మిగిలిన 14 వుంది ఎస్సీలకు ఇళ్ల స్థలాలు వుంజూరు కాలేదు. ఇదే గ్రావూనికి చెందిన మెనార్టీలు, ఓసీలకు చెందిన 58 వుందికి వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా పరిహారం అందాల్సిఉంది. వురో 110 వుంది నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి ఉంది.
గోవిందాపురంలో..
గోవిందాపురంలో మెుత్తం 367 కుటుంబాలకు గాను, ఇప్పటికి 335 వుంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా పరిహారం చెక్కులు అందించారు. ఇంకా 32 వుంది నిర్వాసితులకు చెక్కులివ్వాలి. వుుంపు గ్రావూల ప్రజల సవుస్యల పరిష్కారానికి కృషి చేస్తావున్న అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలు నెరవేరేది ఎప్పుడోనని ఎదురుచూస్తున్నారు.
తేలని అసైన్డ్‌భూమి వ్యవహారం..
రేగులగడ్డ గ్రావుంలో ఎస్సీలకు చెందిన సువూరు 80 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, వివిధ కారణాలతో 33 ఎకరాలను పరిహారానికి అర్హతగలవిగా తేల్చారు. గోవిందాపురంలో సువూరు 120 ఎకరాలు, వెల్లంపల్లిలో 50 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. వారసత్వం ద్వారా సంక్రమించినవి, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూములకు వూత్రమే పరిహారం ఇస్తావున్నారు. కానీ నేటికీ ఈ సవుస్య కొలిక్కి రాలేదు.
అందరికీ న్యాయం జరిగేలా చూడాలి : బండి రాఘవరెడ్డి, సర్పంచ్, వెల్లంపల్లి
పులిచింతల నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వాధికారులు చూడాలి. 230 వుందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 92 వుందిని కూడా అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. త్వరగా సవుస్యలు పరిష్కరించాలి.
Advertisement
Advertisement