displaced persons
-
త్యాగానికి బహుమానం అవమానం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులకు మెరుగైన రీతిలో పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ముంపు గ్రామాలకు చెందిన వేలాది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించింది. తద్వారా ఈ కుటుంబాల్లోని దాదాపు లక్షలాదిమంది నిర్వాసితులను రోడ్డున పడేసింది. పోలవరం, వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగమైన హిరమండలం రిజర్వాయర్, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని అమలు చేయకుండానే పోలీసులను ప్రయోగించి, బలవంతంగా ఉన్న ఊళ్ల నుంచి ఖాళీ చేయించింది. భూసేకరణ చట్టాన్ని అపహాస్యం చేసి.. భూసేకరణ చట్టం–2013 ప్రకారం.. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి. మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు అధికంగా పరిహారాన్ని చెల్లించి భూములను సేకరించాలి. భూసేకరణలో నిర్వాసితులను దోచేస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు.. వారికి పునరావాసం కల్పించే విషయంలోనూ లూటీ చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులకు జీవనోపాధి, ఇంటి సామగ్రి రవాణా, ఏడాది పనిదినాల కల్పనతో కలిపి ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.6.36 లక్షలు, గిరిజన కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. పునరావాస కాలనీని నిర్మించి, అన్ని మౌలిక సదుపాయాలతో వారికి ఆశ్రయం కల్పించాలి. ఇళ్లు నిర్మించుకోవడానికి నిధులు ఇవ్వాలని కోరితే.. నిర్మాణానికయ్యే మొత్తాన్ని నిర్వాసితులకు అందజేయాలి. ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఉంటే వారిని ప్రత్యేక కుటుంబంగా గుర్తించి.. ఇదే రీతిలో ప్యాకేజీని వర్తింపజేయాలి. పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల 499 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు ఉండటం గమనార్హం. ప్రాజెక్టుల వల్ల 1,62,870 కుటుంబాలకు చెందిన ఏడు లక్షల మంది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామసభలు నిర్వహించాలి. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచాలి. కానీ.. టీడీపీ కీలక నేతలతో కుమ్మక్కైన ఉన్నతాధికారులు గ్రామసభలకు మోకాలడ్డారు. తాము నియమించుకున్న దళారీల ద్వారా ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించినవారు నిర్వాసితులైనా, కాకున్నా లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారు. ఆ జాబితా మేరకే పరిహారం చెల్లిస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఐదు సెంట్ల భూమిని కేటాయించి పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలి. పోలవరం నిర్వాసితులకు మాత్రమే ఇళ్లను నిర్మిస్తున్న సర్కార్.. మిగిలిన ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించి.. నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలను మాత్రమే ఇస్తోంది. కానీ.. సర్కార్ నిర్మిస్తోన్న ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. కేవలం సెంటు సెంటున్నర భూమిలో ఇరుకైన ఒకే గది, దానికి అనుబంధంగా చిన్న వంట గది, మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నారు. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణానికి రూ.లక్షకు మించి వ్యయం కాదు. కానీ.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.9 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకూ అంచనా అవుతుందని లెక్కలు వేసి ఆ పనులను గంపగుత్తగా టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఇందులో రూ.వందలాది కోట్ల కమీషన్లు చేతులు మారుతున్నాయి. ఒక్కో చోట.. ఒక్కో రీతిలో పరిహారం ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్కో ప్రాజెక్టులో ఒక్కో రీతిలో పరిహారం అందజేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం ఇస్తుంటే.. గిరిజనేతరులకు రూ.6.36 లక్షల చొప్పున అందజేస్తోంది. గండికోట నిర్వాసితులకు కొందరికి రూ.3.75 లక్షల చొప్పున, మరికొందరికి రూ.4.89 లక్షల చొప్పున పరిహారాన్ని మంజూరు చేసింది. ఇక హిరమండలం రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. భూమి ఒక చోట.. ఇళ్లు మరో చోట పోలవరం, హిరమండలం పునరావాస కాలనీలకు సమీపంలోనే గిరిజనులకు ఒక్కో కుటుంబానికి కనీసం 2.5 హెక్టార్ల సాగు భూమికి బదులుగా అంతే స్థాయిలో సాగు భూమి కేటాయించాలి. కానీ.. సర్కార్ తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితులను బస్సులో తీసుకొస్తున్న అధికారులు పునరావాస కాలనీల సమీపంలోని భూములను చూపించి.. వాటినే మీకు ఇస్తున్నామని చెప్పి నమ్మబలుకుతున్నారు. ఆ తర్వాత పునరావాస కాలనీకి 25 కి.మీ.ల దూరంలో కొండలు, గుట్టల్లోని భూములను కేటాయిస్తున్నారు. ఒక్కో గిరిజనుడికి గరిష్టంగా ఐదు ఎకరాల భూమిని ఒకే చోట చూపించాలి. కానీ.. ఎకరం, అరెకరం చొప్పున సర్కార్ ఐదారు చోట్ల భూమిని కేటాయిస్తుండటంతో వాటిని తామెలా సాగు చేసుకోగలుగుతామని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ట్రిబ్యునల్ విచారణలో ఉన్న భూములను సర్కార్ సేకరించకూడదు. కానీ.. కోర్టుల్లో విచారణలో ఉన్న భూములను కూడా సేకరించిన అధికారులు.. నిర్వాసితులకు కేటాయిస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన గిరిజనులను స్థానికులు అడ్డుకుంటున్నారు. -
మూడు సెంట్లు ఏమూలకు..
వేలేరుపాడు : పచ్చని చెట్ల నడుమ.. విశాలమైన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ప్రశాంతంగా బతికిన వారంతా ప్రభుత్వ పుణ్యమా అని ఇరుకు జాగాల్లో మగ్గాల్సిన దుస్థితి తలెత్తు తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 29,545 కుటుంబాలు నిర్వాసితుల జాబితాలోకి చేరాయి. ఇందులో 10 వేల వరకు గిరిజన కుటుంబాలు కాగా.. మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు. ఈ రెండు మండలాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలోకి చేరడంతో వీరంతా సర్వస్వం కోల్పోయి.. అగ్నిప్రమాద బాధితుల తరహాలో కట్టుబట్టలతో బయటకు రావాలి్సన పరిస్థితి ఏర్పడుతోంది. ముంపు మండలాల్లోని ఏ గ్రామంలో చూసినా పేద, గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబం కనీసం 25 సెంట్ల స్థలంలో తమ స్థాయిని బట్టి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉటోంది. ఇంటి పెరట్లోనే కూరగాయలు పండించుకుంటున్నారు. పండ్ల మొక్కలను సైతం పెంచుకుని ఫలసాయం అనుభవిస్తున్నారు. పశువుల్ని పెంచుకుంటూ.. వాటిని పాకల్లో సంరక్షించుకుంటూ ఎంతోకొంత ఆదాయం పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వీరంతా స్వగ్రామాలను, సొంత ఇళ్లను వదులుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు సెంట్ల జాగాలో మగ్గిపోవాలట ప్రశాంత వాతావరణంలో.. విశాలమైన ఇళ్లలో జీవించిన గిరిజన కుటుంబాలకు 5 సెంట్లు, గిరిజనేతర కుటుం బాలకు 3 సెంట్ల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గిరిజనేతరులకు పట్టణ ప్రాంతాల్లో నివాసం కల్పిం చాల్సి ఉండటంతో వారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఉండేలా కాలనీ నిర్మించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నిర్ణయంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే.. గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలో ధాన్యం గరిసెలు, దుక్కిటెడ్లు, పాడి పశువులు ఉంచుతారు. ప్రభుత్వం కేటాయించే ఐదు సెంట్ల భూమిలో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం కష్టసాధ్యమని గిరిజనులు వాపోతున్నారు. కనీసం గిరిజనులకు 8 సెంట్లు, గిరిజనేతరులకు 5 సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఎలా ఉండగలం సర్వం వదులుకుని సొంతూరు నుంచి పునరావాస ప్రాంతానికి వెళ్తున్నాం. గిరిజనులకు ప్రభుత్వం 5 సెంట్ల భూమి ఇస్తుందట. ఆ జాగాలో అన్ని వసతులు కల్పించుకోవడం కష్టం. మా దుక్కెటెడ్లు, పాడి పశువులు, మేకలు, ధాన్యం గరిసెలు లేకపోతే ఎలా జీవించగలం. గిరిజనులకు 8 సెంట్ల జాగా అయినా ఇవ్వాలి. – కొవ్వాసి ధనలక్ష్మి, సర్పంచ్, కట్కూరు ప్రశాంతంగా బతకనివ్వరా ఎకరం స్థలంలో విశాలమైన ఇంటిని నిర్మించుకున్నాం. మా కుటుంబమంతా ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మా పెరట్లో అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే మూడు సెంట్ల స్థలంలో ఎలా ఉండగలం. ప్రభుత్వానికిది న్యాయమేనా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా. – కోటా రమేష్‌బాబు, రైతు, వేలేరుపాడు ఐదు సెంట్లు ఇవ్వాలి గిరిజనేతరులకు ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల ఇంటిస్థలం ఏ మూలకూ సరిపోదు. అంత చిన్న విస్తీర్ణంలో ఎలా నివాసం ఉండగలం. కనీసం ఐదు సెంట్లు ఇవ్వాలి. పశువుల పాకలకు స్థలమివ్వాలి. – వలపర్ల రాములు, వేలేరుపాడు -
కుదరని గూడు.. తీరని ‘చింత’!
* ఇదీ పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల పరిస్థితి * వెల్లంపల్లిలో 92 వుందికి వుంజూరు కాని ఇళ్లు * ఇళ్లు మంజూరవుతాయో లేదోనని నిర్వాసితుల ఆందోళన * తేలని అసైన్డ్భూమి వ్యవహారం పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల గోడు ఎవ్వరికీ పట్టడంలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేపట్టి నీటిని నిల్వ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీన వైఖరి వెరసి నిర్వాసితులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గూడు అందక.. పరిహారం పొందక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మాచవరం: మండలంలో పులిచింతల ముంపు గ్రామాలైన రేగులగడ్డ, వెల్లంపల్లి, వేమవరం, గోవిందాపురం గ్రామాల ప్రజల సమస్యలు తీర్చే నాథుడే కరువయ్యాడు. అధికారులు, పాలకులు వచ్చినప్పుడల్లా అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పడమే కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయారు. వెల్లంపల్లి గ్రావుంలో.. వెల్లంపల్లి వాసులకు బ్రాహ్మణపల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద స్థలాలు కేటాయించారు. గ్రామంలోని మొత్తం 417 మందిని అర్హులుగా గుర్తించి ఇళ్ల ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. అయితే 230 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలిచ్చారు. ఇంకా 92 మందికి ఇళ్ల పట్టాలు అందించాల్సిఉంది. స్కూళ్లకు, దేవాలయాలకు మిగిలిన ప్లాట్లు కేటాయించాల్సిఉంది. ఈ 92 వుందికి సంబంధించి రీసర్వే, 15 ఏళ్ల క్రితం గ్రావుంలో నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపాలంటున్నారు. వాటి ద్వారానే అర్హత గుర్తిస్తావుని అధికారులు చెబుతుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేగులగడ్డలో.. రేగులగడ్డ గ్రామానికి బ్రాహ్మణపల్లి సమీపంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూములను కొనుగోలు చేయగా, భూ యజమానులు తమ భూమికి ఇచ్చే ధర గిట్టుబాటు కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదు. నిర్వాసితులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వాధికారులు ముందుకొచ్చి, విడతల వారీగా లబ్ధిదారులకు చెక్కులను అందిస్తున్నారు. రేగులగడ్డ గ్రావుంలో మెుత్తం 603 వుంది అర్హులు ఉండగా, 416 వుందికి చెక్కులు ఇవ్వగా, మిగిలిన 187 వుందికి పరిహారం అందాల్సి ఉంది. వేవువరంలో.. వేమవరంలో ఎస్సీ కాలనీలో 112 వుందిని నిర్వాసితులుగా గుర్తించారు. వారిలో 98 వుందికి గ్రామ శివారులో ఇళ్లు కేటాయించారు. మిగిలిన 14 వుంది ఎస్సీలకు ఇళ్ల స్థలాలు వుంజూరు కాలేదు. ఇదే గ్రావూనికి చెందిన మెనార్టీలు, ఓసీలకు చెందిన 58 వుందికి వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా పరిహారం అందాల్సిఉంది. వురో 110 వుంది నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి ఉంది. గోవిందాపురంలో.. గోవిందాపురంలో మెుత్తం 367 కుటుంబాలకు గాను, ఇప్పటికి 335 వుంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా పరిహారం చెక్కులు అందించారు. ఇంకా 32 వుంది నిర్వాసితులకు చెక్కులివ్వాలి. వుుంపు గ్రావూల ప్రజల సవుస్యల పరిష్కారానికి కృషి చేస్తావున్న అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలు నెరవేరేది ఎప్పుడోనని ఎదురుచూస్తున్నారు. తేలని అసైన్డ్భూమి వ్యవహారం.. రేగులగడ్డ గ్రావుంలో ఎస్సీలకు చెందిన సువూరు 80 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, వివిధ కారణాలతో 33 ఎకరాలను పరిహారానికి అర్హతగలవిగా తేల్చారు. గోవిందాపురంలో సువూరు 120 ఎకరాలు, వెల్లంపల్లిలో 50 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. వారసత్వం ద్వారా సంక్రమించినవి, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూములకు వూత్రమే పరిహారం ఇస్తావున్నారు. కానీ నేటికీ ఈ సవుస్య కొలిక్కి రాలేదు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలి : బండి రాఘవరెడ్డి, సర్పంచ్, వెల్లంపల్లి పులిచింతల నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వాధికారులు చూడాలి. 230 వుందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 92 వుందిని కూడా అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. త్వరగా సవుస్యలు పరిష్కరించాలి.