మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని నాలుగో యూనిట్‌లోకి చేరిన
ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని నాలుగో యూనిట్‌లోకి చేరిన లీకేజీ నీరు తరలింపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం లీకేజీ ద్వారా వచ్చిన నీరు అక్కడ ఉన్న రక్షణగోడను దాటి రోటర్ల వద్దకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జెన్‌కో హైడల్ డెరైక్టర్ వెంకటరాజం ఆధ్వర్యంలో శనివారం ఉదయం వరకు ఈ సహాయక చర్యలు కొనసాగాయి. అలాగే 1, 2వ యూనిట్ ద్వారా 3లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి నీటిని దిగువకు వదిలారు.
ప్రస్తుతం 298 మీటర్ల నీటి నిల్వ నుంచి ఒక మీటరు నీరు తగ్గింది. 100హెచ్‌పీ మోటారు ద్వారా లీకేజీ నీటిని తరలిస్తున్నారు. కూలిపోయిన అడ్డుగోడకు తిరిగి మరమ్మతులు చేశారు.