
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 79 శాతం బావుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర భూగర్భ జల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14,275 బావుల్లో గత పదేళ్లగా నీటి మట్టాలపై అధ్యయనం నిర్వహించి రూపొందించిన నివేదికను కేంద్రం ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టింది.
2021 నవంబరు గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 706 బావుల్లో పరిశీలన చేపట్టగా 419 బావుల్లో గరిష్టంగా రెండు మీటర్ల మేర నీటి మట్టంలో పెరుగుదల కనిపించినట్లు వెల్లడైంది. మరో 50 బావుల్లో నాలుగు మీటర్లకు పైనే నీటి మట్టం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో 80 నుంచి 86 శాతం బావుల్లో నీటి మట్టాల పెరుగుదల నమోదైంది. ఉత్తరాదిలో పెరుగుదల స్వల్పంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా బావుల్లో నీటి మట్టాల పెరుగుదల కారణంగా జాతీయ సగటు 70 శాతంగా నమోదైంది.
‘ఉపాధి’లో వర్షపు నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం..
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున పనులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటి నిల్వకు దోహదపడే వాటినే ఎక్కువగా చేపడుతోంది. గత మూడేళ్లలో దాదాపు రూ.3,147.43 కోట్ల విలువైన వర్షపు నీటి నిల్వలకు దోహద పడే పనులను చేపట్టింది. ఇందులో గత ఆరి్థక ఏడాదిలో రూ.1,004 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ ద్వారా చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment