central ground water board
-
‘వెల్’ డన్! పాతాళ గంగ పైపైకి..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 79 శాతం బావుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర భూగర్భ జల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14,275 బావుల్లో గత పదేళ్లగా నీటి మట్టాలపై అధ్యయనం నిర్వహించి రూపొందించిన నివేదికను కేంద్రం ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. 2021 నవంబరు గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 706 బావుల్లో పరిశీలన చేపట్టగా 419 బావుల్లో గరిష్టంగా రెండు మీటర్ల మేర నీటి మట్టంలో పెరుగుదల కనిపించినట్లు వెల్లడైంది. మరో 50 బావుల్లో నాలుగు మీటర్లకు పైనే నీటి మట్టం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో 80 నుంచి 86 శాతం బావుల్లో నీటి మట్టాల పెరుగుదల నమోదైంది. ఉత్తరాదిలో పెరుగుదల స్వల్పంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా బావుల్లో నీటి మట్టాల పెరుగుదల కారణంగా జాతీయ సగటు 70 శాతంగా నమోదైంది. ‘ఉపాధి’లో వర్షపు నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున పనులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటి నిల్వకు దోహదపడే వాటినే ఎక్కువగా చేపడుతోంది. గత మూడేళ్లలో దాదాపు రూ.3,147.43 కోట్ల విలువైన వర్షపు నీటి నిల్వలకు దోహద పడే పనులను చేపట్టింది. ఇందులో గత ఆరి్థక ఏడాదిలో రూ.1,004 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ ద్వారా చేపట్టారు. -
ఏడేళ్లలో రూ.42 లక్షల ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దండబోయిన ఓబులేశ్‌పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. 2009 నుంచి 2016 వరకు రిగ్గర్ డ్రిల్లింగ్ తెలంగాణ ఇన్చార్జిగా పనిచేసిన ఓబులేశ్ కాంట్రాక్టర్లకు కొమ్ముకాయడంతో పాటు సంస్థ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్టు సీబీఐ ఆరోపిస్తూ పీసీ యాక్ట్ 17, 18 కింద కేసులు నమోదు చేసింది. ఈ ఏడేళ్లలో రూ.42.30 లక్షల ఆస్తులను కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. హయత్‌నగర్‌లో రూ.39 లక్షల విలువైన రెండు అంతస్తుల భవనం, రూ.8.8 లక్షల విలువైన 267 గజాల ప్లాట్, అక్కడే మరో సర్వే నంబర్లో 9లక్షల విలువైన స్థలాన్ని గుర్తించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఏడేళ్లలో ఓబులేశ్ జీతాలు, సేవింగ్స్‌ను అనాలిసిస్ చేసిన అనం తరం, ఇంతటి విలువైన ఆస్తులు కూడబెట్టడం వెనుక అక్రమార్జన ఉందని సీబీఐ ఆరోపించింది. -
ఉద్యోగ సమాచారం
యూపీఎస్సీలో 457 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ పోస్టుల భర్తీకి కంబైన్డ డిఫెన్స సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ)ను నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 457 ((ఇండియన్ మిలటరీ అకాడెమీ-200, ఇండియన్ నావెల్ అకాడెమీ-45, ఎయిర్ఫోర్స అకాడెమీ-32, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (మెన్)-175, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (ఉమెన్)-5)). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 4. పూర్తి వివరాలకు www.upsc.gov.inగానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ (నవంబర్ 7-13 సంచిక) గానీ చూడొచ్చు. అంబేడ్కర్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్లు న్యూఢిల్లీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 126 (ఓపెన్-67, ఓబీసీ-39, ఎస్సీ-13, ఎస్టీ-7). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 24, 26, 27. పూర్తి వివరాలకు http://delhi.gov.in/wps/wcm/connect/ doit_ dbsah /DBSAH/Homeచూడొచ్చు. అణు ఇంధన విభాగం పరిధిలో సెక్యూరిటీ సిబ్బంది అణు ఇంధన విభాగం పరిధిలోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీ.. సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 70 (అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-12, సెక్యూరిటీ గార్డ-58). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.cat.ernet.inచూడొచ్చు. శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్లో అప్రెంటిస్‌లు తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.. లైబ్రరీ సైన్సలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 7 ప్లస్ ప్యానెల్. ఇంటర్వ్యూ తేది నవంబర్ 25. పూర్తి వివరాలకు www.sctimst.ac.inచూడొచ్చు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో స్టోర్ కీపర్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.. అసిస్టెంట్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (ఓపెన్-4, ఎస్సీ-2). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.cgwb.gov.in/Vacancies/ASK-CR0615.ఞఛీజ చూడొచ్చు. కృషి విద్యాపీఠ్‌లో వివిధ పోస్టులు అకోలా(మహారాష్ట్ర)లోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (అసిస్టెంట్ బయోకెమిస్ట్-1, సీనియర్ మెకానిక్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, వెల్డర్-1, ఫిట్టర్-1, లాబ్ అసిస్టెంట్-1). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.pdkv.ac.inచూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఐసీఏఆర్ అనుబంధ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్‌డ రీసెర్చ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (మాలిక్యులర్ బ్రీడింగ్-2, హైబ్రిడ్ మస్టర్‌డ కంపొనెంట్-3). ఇంటర్వ్యూ తేది నవంబర్ 19. పూర్తి వివరాలకు www.drmr.res.inచూడొచ్చు. ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వివిధ పోస్టులు ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (రీసెర్చ అసోసియేట్-1, జేఆర్ఎఫ్-2, ఫీల్డ్ అసిస్టెంట్-2). ఇంటర్వ్యూ తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.icfre.orgచూడొచ్చు. -
మన భూగర్భ జలాలు విషతుల్యం
దేశంలో సగానికన్నా ఎక్కువ భూభాగంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. దేశంలోని 676 జిల్లాల్లో 21 రాష్ట్రాల పరిధిలోని 387 జిల్లాల్లో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని సాక్షాత్తు కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సీజీడబ్లూబీ) ఓ నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర 15 రాష్ట్రాల్లోని 113 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి భారలోహాలు, సీసం, కాడ్మియం, క్రోమియం, ఫ్లోరైడ్ ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. దేశంలోని 276 జిల్లాల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం మరీ ఎక్కువగా ఉందని వెల్లడించింది. గత మూడు దశాబ్దాలుగా కాలుష్య నియంత్రణ బోర్డులు, కమిటీలు నిద్రపోతుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ పర్యావరణవేత్త మనోజ్ మిశ్రా ఆరోపించారు. పది రాష్ట్రాల్లోని 86 జిల్లాల భూగర్భ జలాల్లో స్లో పాయిజన్‌గా పనిచేసే విషపదార్థాలు కలిశాయని, వాటిని తొలగించడం అంత సులువైన విషయం కాదని కేంద్ర భూగర్భ జలాల బోర్డు చైర్మన్ కేబీ బిశ్వాస్ తెలిపారు. గంగా జలాల ప్రక్షాళన ప్రధాన ఎజెండాగా పెట్టుకొని కూడా ఏమీ చేయలేక సుప్రీంకోర్టు చేత చీవాట్లు తింటున్న కేంద్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోగలదో ఊహించవచ్చు.