ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ ఫంటలకు జీవం పోశాయి. రెండు నెలలుగా వర్షాల్లేక పంటలపై ఆశలు వదులుకున్న రైతుల ఆశలు మళ్లీ చిగురింపజేశాయి. దీర్గకాలిక పంటలైన పత్తి, సోయాబీన్, వరి, కంది పంటలకు మేలు చేకూరింది. పంటలు ఎండుతున్న దశలో గత సోమవారం నుంచి ఏకధాటిగా వర్షాలుకు కురిసాయి. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు వర్షాలు పడడం అదృష్టంగా భావిస్తున్నారు.
వర్షాల్లేక భూగర్భ జలాలు అడుగంటి, బోర్లలో నీళ్లు లేక వరి పంట ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ వర్షాలతో బావులు, కుంటలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరింది. దీంతో వరి పంటలకు ఢోకా లేదని రైతులు భావిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురియక ఖరీఫ్‌లో మొక్కజొన్న కర్రలు ఎండి నేలకొరిగాయి. ఈ క్రమంలో మొక్కజొన్న పరిస్థితినే ఎదుర్కొంటున్న కంది, పత్తి, సోయా, పసుపు పంటలు తాజా వర్షాలతో దిగుబడి వచ్చే వరకూ ఎలాంటి సమస్య రాదని స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నీటిని పీల్చుకునే శక్తి తక్కువగా ఉన్న నల్ల రేగడి పొలాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
చేలల్లో నీరు నిల్వ ఉంచవద్దు
Published Wed, Sep 3 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement