శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్/ దోమలపెంట/ గద్వాల రూరల్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది మళ్లీ పోటెత్తింది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,60,748 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద 215.8 టీఎంసీలను నిల్వ చేశారు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 27,137 క్యూసెక్కులతో పాటు ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా మొత్తం 3,16,652 క్యూసెక్కులను శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 3,38,298 క్యూసెక్కులను పూర్తిగా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.8 అడుగులవద్ద 308.47 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. అలాగే పులిచింతలలోకి 4,09,060 క్యూసెక్కులు వస్తుండగా 3,96,062 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 82,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 92,550 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు 52.94 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 70 వేల క్యూసెక్కులను శ్రీశైలం డ్యామ్ వైపు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment