వరాల తల్లి..సిద్ధిదాయిని
నవదుర్గల్లో తొమ్మిదో రూపం సిద్ధిదాయిని. మహర్నవమిన అమ్మవారిని సేవించే సాధకులకు సర్వసిద్ధులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అమ్మవారు చతుర్భుజాలను కలిగి, పద్మాసనంపై ఆశీనురాలై కనిపిస్తారు. కుడివైపు చేతులలో గద, చక్రం, ఎడమవైపు చేతులలో పద్మాలను, శంఖం ధరించి ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడు ఈమె నుంచే సిద్ధులను పొందినట్లు దేవీపురాణం చెబుతోంది.
- శ్రీశైలం