నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య బాబు అదిరిపోయే అప్‌డేట్‌ | NTR Jayanthi: Nandamuri Balakrishna To Make A Surprise Announcement Tomorrow | Sakshi

నందమూరి అభిమానులకు బాలయ్య సర్‌ప్రైజ్‌..

Published Wed, May 26 2021 4:32 PM | Last Updated on Wed, May 26 2021 6:27 PM

NTR Jayanthi: Nandamuri Balakrishna To Make A Surprise Announcement Tomorrow - Sakshi

నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి సిద్దమయ్యాడు బాలకృష్ణ. ఈ మేరకు రేపు (మే 27) ఉదయం  8.45 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్‌ ఫోటో ఉంచడంతో ఆ సర్‌ప్రైజ్‌ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ‘అఖండ’నుంచి ఓ పాట విడుదల కాబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలనే రేపు వెల్లడిస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’విడుదల చేయనున్నాడని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి బాలయ్య బాబు ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement