
నటసింహం నందమూరి బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సెట్లో ఆయనను చూసి ఆశ్చర్య పోయానని చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. పక్కా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్న ప్రగ్యా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను పంచుకుంది.
‘‘అఖండ’లో అవకాశం వచ్చిందనగానే భయపడిపోయాను. బాలయ్యకు కోపం ఎక్కువనీ.. సెట్‌లో ఉన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండాలని కొందరు చెప్పడమే నా భయానికి కారణం. అయితే వాళ్ళు చెప్పినట్టు కాకుండా సెట్‌లో ఆయన చాలా సరదాగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయా. జోక్స్ వేస్తూ ఎప్పుడూ నవ్విస్తుంటారు. ఆయన కూల్‌గా ఉండటంతో ధైర్యంగా నటించాను’ అని చెప్పుకొచ్చింది ప్రగ్యా. అంతేకాదు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.
ఇక అఖండ విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment