Akhanda Music Director SS Thaman Interesting Comments On 'Akhanda Movie' In Interview - Sakshi
Sakshi News home page

అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశా, ఆ పాటకు నెల రోజులు పట్టింది: తమన్‌

Published Tue, Nov 23 2021 6:16 PM | Last Updated on Wed, Nov 24 2021 9:28 AM

SS Thaman Interesting Comments On Akhanda Movie - Sakshi

సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే  పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ( Akhanda)`కు సంగీతం అందించాడు తమన్‌. ఈ మూవీ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. అఖండ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు.

ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్‌లాంటి సినిమా.

అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే  హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు.  ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చేయడం చాలా కొత్త. సపరేట్‌గా ఇద్దరికి పని చేయడం వేరే.. ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరు. ఇది వేరే ఫైర్.

ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్‌లో ఉంటుంది.

► అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం.

నిర్మాత చాలా మంచివారు. ఆయన సినిమాలకు చెందిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

ఇలాంటి జానర్‌లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది. 

డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్ , జగపతి బాబు అద్భుతంగా కనిపిస్తారు.

మ్యూజిక్ అనేది చాలా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు గ్రీటింగ్ కార్డ్‌లా మ్యూజిక్ మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంకో పది, ఇరవై ఏళ్లు ఉంటుంది. ఈ ట్రెండ్ మంచిది. పాట హిట్ అయితే సింగర్ల గురించి వెతుకుతారు. కానీ ఇప్పుడు సింగర్లు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. వారి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి సంతోషిస్తారు. ఆ విషయంలో హీరోలకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్, హీరోలు అందరూ ఒప్పుకుని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పాటలను విడుదల చేయడం వల్ల ఆడియో కంపెనీలకు రెవెన్యూ కూడా వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement