Akhanda Making Videos: Nandamuri Balakrishna Akhanda Making Video Out Now - Sakshi
Sakshi News home page

Akhanda: అఖండ మేకింగ్‌ వీడియో, త్రిశూలం పట్టిన బోయపాటి!

Jan 24 2022 11:33 AM | Updated on Jan 24 2022 12:15 PM

Nandamuri Balakrishna Akhanda Making Video Out Now - Sakshi

ఈ సందర్భంగా హాట్‌ స్టార్‌ అఖండ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇందులో బాలయ్య కష్టాన్ని, టెక్నీషియన్ల శ్రమను, బోయపాటి డెడికేషన్‌ను చూడొచ్చు...

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్‌ 2న ఒంటరిగా బాక్సాఫీస్‌ బరిలోకి దిగిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టించింది. కరోనా వల్ల పెద్దగా కలెక్షన్లు రావేమో అనుకున్న విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచివేస్తూ ఏకంగా రూ.200 కోట్ల(నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌తో కలిపి) వసూళ్లు సాధించింది.

జనవరి 21న అఖండ హాట్‌స్టార్‌లో ల్యాండ్‌ అవగా ఓటీటీలో కూడా తిరుగులేదనిపించుకుంటోందీ చిత్రం. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తొలి 24 గంటల్లోనే ఈ సినిమాను 10 లక్షల మంది వీక్షించారట. ఇది ఓటీటీ చరిత్రలోనే ఒక రికార్డని తెలుస్తోంది. ఈ సందర్భంగా హాట్‌ స్టార్‌ అఖండ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇందులో బాలయ్య కష్టాన్ని, టెక్నీషియన్ల శ్రమను, బోయపాటి డెడికేషన్‌ను చూడొచ్చు. అలాగే కెమెరాలు ఆఫ్‌లో ఉన్నప్పుడు బోయపాటి, బాలయ్యల సరదాగా కబుర్లాడినట్లు కనిపిస్తోంది. బాలయ్య త్రిశూలంతో చేసిన కొన్ని ఫైట్‌ సీన్లను డైరెక్టర్‌ ఎలా దగ్గరుండి చేయించారో కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ మేకింగ్‌ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement