Nivetha Thomas Dance Video On Jai Balayya Song: అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు నందమూరి బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది ఈ సినిమా. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది. సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించాడు తమన్. అఖండలో రెండు షేడ్స్‌లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్‌కు స్టెప్పులేసి అదరగొట్టాడు. జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్‌కు ముందే సూపర్ హిట్ అయింది.
ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఆ పాటకు స్టెప్పులేయడం ట్రెండ్‌గా కూడా మారింది. తాజాగా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ జై బాలయ్యకు పాటకు స్టెప్పులేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది నివేదా. అందుకే జై బాలయ్య సాంగ్‌లోని స్టెప్పులను వదల్లేదు. పాటలో డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుండగా షర్ట్స్ మారే స్పెప్పు వేసింది నివేదా. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బానే ఉంది. రెండో షర్ట్ మారేప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో తాను కూడా నవ్వుతూ ఫన్ క్రియేటే చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment