చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి! | Actress Sai Pallavi Dance At Sister Pooja Kannan Engagement | Sakshi
Sakshi News home page

Sai Pallvi Dance Video: సాయిపల్లవి ఇంట్లో పెళ్లి హడావుడి.. నిశ్చితార్థం ఫొటోలు వైరల్

Published Tue, Jan 23 2024 1:34 PM | Last Updated on Tue, Jan 23 2024 2:33 PM

Actress Sai Pallavi Dance At Sister Pooja Kannan Engagement - Sakshi

హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. చాలారోజుల తర్వాత స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈమె అభిమానులు అయితే డ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. చెల్లి నిశ్చితార్థం సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి.

(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించింది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోకపోయేసరికి ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిందని, యాక్టింగ్ పక్కనబెట్టేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ తమిళంలో ఓ మూవీ, తెలుగులో 'తండేల్' చేస్తుందనేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు.

ఇకపోతే సాయిపల్లవి కంటే చెల్లి పూజా కన్నన్ పెళ్లికి రెడీ అయిపోయింది. సంక్రాంతి టైంలో ప్రియుడి వినీత్‌ని పరిచయం చేసిన ఈమె.. తాజాగా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఈ వేడుకలో అందరితో కలిసి సాయిపల్లవి క్రేజీగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దిగువనే ఉంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement