Keerthy Suresh Teenmar Dance From Dasara Movie, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: తీన్మార్‌ స్టెప్పులతో దుమ్మురేపిన కీర్తిసురేష్‌.. వీడియో వైరల్‌

Published Tue, Apr 4 2023 7:48 AM | Last Updated on Tue, Apr 4 2023 9:04 AM

Keerthy Suresh Teenmar Dance From Dasara Movie Video Goes Viral - Sakshi

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్‌ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో దిగ్విజయంగా దూసుకెళుతోంది. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్‌ అయ్యింది.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్‌లు నటించారు. వీరి నటనకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. డీ గ్లామరస్‌ రోల్‌లో కీర్తి ఇందులో జీవించేసింది. ఈ క్రమంలో తాజాగా వెన్నెల పాత్రకు సంబంధించి ఓ వీడియోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.



పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో వెన్నెల చేసే మాస్‌ డ్యాన్స్‌ వీడియో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఊరమాస్‌ స్టెప్పులతో ఇరగదీస్తుందంటూ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement