
‘సింహా’,‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా తాజా షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్‌లో బాలకృష్ణ సహా ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.