
Mahesh Babu Review On Balakrishna Akhanda Movie: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ థియేటర్లలో విడుదలై కేక పుట్టిస్తోంది. మంచి ఓపెనింగ్స్, అదిరిపోయే టాక్‌తో ఖాతా తెరిచిన అఖండ రికార్డుల దిశగా ముందుకెళ్లడం ఖాయమనిపిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చాడు.
అఖండ సినిమా చూసిన అనంరతం మహేశ్ ట్వీట్ ‘అఖండ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందనలు’ అంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమాపై మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ తొలిసారిగా విలన్‌గా నటించి స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడని అంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా నటించగా.. పూర్ణ కీలక పాత్రలో నటించింది. జగపతిబాబు కీ రోల్ పోషించాడు.
Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation
— Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2021