ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో మన హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 70 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు సైతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పుచ్చకుంటున్నారు. కానీ సీనియర్లు హీరోలలో ఒక్క చిరంజీవి తప్ప మిగతావారంతా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేశ్‌లు సినిమాను బట్టి రూ.5 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటున్నటు సమాచారం. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పుచ్చుకుంటున్నారట.
బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’కు కూడా బాలయ్య రూ.7 కోట్లు తీసుకుంటానని మొదట ఒప్పుకున్నాడట. కానీ ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రావడంలో తన రెమ్యునరేషన్‌ని పెంచాడట ఈ నందమూరి నటసింహం. యూట్యూబ్‌లో అఖండ టీజర్ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టి రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఈ టీజర్ సూపర్ హిట్ కావడంతో బాలయ్య తన పారితోషికాన్ని మరో మూడు కోట్లు పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంటే అఖండ కోసం బాలయ్య మొత్తంగా రూ.10 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. రూ.70 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. అందుకే బోయపాటి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా విడుదల తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ ప్రాఫిట్ బట్టి దర్శకుడికి షేర్స్ ఇస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment