Akhanda Heroine Pragya Jaiswal Latest Photos Goes Viral | Pragya Jaiswal HD Images - Sakshi
Sakshi News home page

'అఖండ' హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ ఫోటోలు వైరల్‌

Published Tue, Oct 26 2021 1:08 PM | Last Updated on Tue, Oct 26 2021 2:11 PM

Akhanda Heroine Pragya Jaiswal Latest Photos Goes Viral - Sakshi

Pragya Jaiswal HD Images: మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్‌ క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకీ నాయకా' సినిమాలో నటించిన ప్రగ్యా ఇప్పుడు మరోసారి ఆయన దర్శక్వంలో అఖండ సినిమాలో నటిస్తుంది. బాలయ్యకు జోడీగా తొలిసారి నటించిన ప్రగ్యాకు సోషల్‌ మీడియాలో బాగానే ఫాలోయింగ్‌ ఉంది.

ఇటీవలె సూట్‌, చీర కాంబినేషన్‌లో ధరించిన కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. టైమ్స్‌ బిజినెస్‌ అవారర్డ్స్‌ 2021 సందర్భంగా ఈ భామ తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న అఖండ సినిమా షూటింగ్‌ ఇటీవలె పూర్తియ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రటించే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement