
టాలీవుడ్ విలన్స్ లో బోయపాటి మూవీ విలన్స్ మరీ క్రూయెల్ గా ఉంటారు. లెజెండ్ లో జగపతి, సరైనోడు లో ఆదిపినిశెట్టి, వినయ విధేయ రామలో వివేక్ ఓబెరాయ్ పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించారు. ఇప్పుడు ఇదే రేంజ్ విలనీతో ఆడియెన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు హీరో శ్రీకాంత్.
బాలయ్య-బోయపాటి కాంబో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అందులో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో క్రూరమైన లుక్స్ తో బాలయ్యనే భయపెడుతున్నాడు. శ్రీకాంత్ కు కంప్లీట్ గా న్యూ ఇమేజ్ ఇచ్చేందుకు బోయపాటి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడట.
గతంలో లెజెండ్ తో జగపతిబాబును విలన్ గా మార్చి అతనికి స్టార్ డమ్ తీసుకొచ్చాడు బోయపాటి. ఇప్పుడు సేమ్ సీన్ శ్రీకాంత్ విషయంలోనూ రిపీట్ అవుతుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అఖండలో శ్రీకాంత్ విలనీ వర్క్ అవుట్ అయితే మాత్రం టాలీవుడ్ లో మరో స్టార్ విలన్ అందుబాటులోకి వచ్చినట్లే లెక్క.
Comments
Please login to add a commentAdd a comment