Akhanda 100 Days Celebrations Event: Balakrishna Funny Moments With Pragya Jaiswal - Sakshi
Sakshi News home page

Balakrishna: అఖండ హీరోయిన్‌తో బాలయ్య ‘దబిడి దిబిడి’.. వైరల్‌ వీడియో

Published Sun, Mar 13 2022 5:36 PM | Last Updated on Sun, Mar 13 2022 6:14 PM

When Balakrishna Funny Moments With Pragya Jaiswal Akhanda Movie 100 Days Event - Sakshi

‘అఖండ’ మూవీతో నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్‌లో వంద కోట్ల వసూళ్ళను సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచింది. ఇండియా మొత్తంగా రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాతికి ముందే రిలీజ్ అయిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లో ఇప్పటికీ ఈ మూవీ షో వేస్తున్నారంటే అఖండ క్రేజ్‌ ఎల ఉందో అర్థమవుతోంది.

చదవండి: హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం

ఈ నేపథ్యంలో ఈ మూవీ 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ టీం 100 రోజుల వేడుకను ‘కృతజ్ఞత సభ’ పేరుతో కర్నూల్‌ ఎస్టీబీసీ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ టీం అంతా బస్సులో కర్నూలు బయలుదేరిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో బాలకృష్ణ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ను భయపెట్టిస్తూ ఫ్యాన్స్‌ పట్ల కృతజ్ఞత చూపించిన తీరు ఆసక్తిగా ఉంది.

చదవండి: సమంత హాట్‌ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్‌

కాగా ఈ వీడియోలో బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్‌ను పిలిచి.. ‘ప్రగ్యా ఇప్పుడే బాగా విశ్రాంతి తీసుకో.. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రాయలసీమ. అక్కడ జనం అభిమాన్ని తట్టుకోలేవ్‌.. దబిడి దిబిడియే’ అంటూ ఆటపట్టించాడు. ఇందులో బాలయ్య తీరును చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియోను పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ, హీరోయిన్‌ ప్రగ్యాజెస్వాల్‌తో పాటు నటి పూర్ణ, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, మిగత మూవీ క్రూడ్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement