
ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న పలువురు సెలబ్రిటీలు చలపతి చౌదరికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడకు చెందిన చౌదరి రాయ్‌చూర్‌లో స్థిరపడ్డారు.
తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, శివరాజ్ కుమార్, బాలకృష్ణ వంటి పలు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. ఇటీవల ఆయన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలోనూ కనిపించి మెప్పించారు.
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment