గతేడాది థియేటర్లలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందండి ఫుల్‌గా ఉంటుందని భావించాయి సినీ వర్గాలు. కానీ ఎప్పటిలాగే కరోనా కోరలు చాచి ఆ సందడిని మాయం చేసింది. ప్రతీ రోజు పెరుగుతున్న కొవిడ్ కేసులతో సినిమా షెడ్యూల్స్ తారుమారు అయ్యాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాయి. కానీ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాన్ని మాత్రం ధైర్యంగా థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్.
ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ త్రోబ్యాక్ వీడియో.. పూరీ జగన్నాథ్ షాక్
పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో చిన్న సినిమాలకు వరంగా మారింది. దీంతో ప్రస్తుతం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు సిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా !
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:
1. వర్మ: వీడు తేడా, జనవరి 21న విడుదల
2. వధుకట్నం, జనవరి 21న విడుదల
3. ఉనికి, జనవరి 26న విడుదల
ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు:
1. అఖండ- జనవరి 21, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
2. శ్యామ్ సింగరాయ్- జనవరి 21, నెట్‌ఫ్లిక్స్
3. లూజర్ 2- జనవరి 21, జీ5
ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..
Comments
Please login to add a commentAdd a comment