యానాంలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ మరణించారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం గోగులలంక వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత రవిశంకర్దేనని పోలీసులు నిర్ధారించారు. యానాంలో ఆనంద్ రీజెన్సీ హోటల్ యజమాని, ప్రముఖ నిర్మాత ఎల్వి ప్రసాద్ మనువడు అయిన రవిశంకర్ ప్రసాద్ ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లి అదృశ్యమయ్యారు. ఆందోళనకు గురైన ఆయన కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తుండగా ఈ రోజు మృతదేహం లభ్యం కావడంతో అంతా హతాశులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూటర్గా చెన్నైలో గుర్తింపు పొందారు. ఆయన నిర్మాతగా పలు తెలుగు సినిమాలు నిర్మించారు.