ఎంత అదృష్టం 'అప్పా' | appa trainee sub inspectors held duty at rajamundry pushkara works | Sakshi
Sakshi News home page

ఎంత అదృష్టం 'అప్పా'

Published Mon, Jul 20 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

ఎంత అదృష్టం 'అప్పా'

ఎంత అదృష్టం 'అప్పా'

తూర్పుగోదావరి జిల్లా: వారంతా శిక్షణ పొందుతున్న సబ్‌ఇన్‌స్పెక్టర్లు. శిక్షణ ముగియడానికి ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ఈలోగా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ అరుదైన అవకాశం వారికి చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది. గోదావరి పుష్కరాల్లో సుమారు 1040 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమి (అప్పా)కి చెందిన ట్రైనీ ఎస్‌ఐలు సేవలందిస్తున్నారు. శిక్షణ పూర్తవకుండానే వచ్చిన తొలి పుష్కర విధులను సమర్థంగా నిర్వహించి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటామంటున్నారు వీరు.

- కోటిలింగాల ఘాట్(రాజమండ్రి)

ఎంతో అదృష్టం
 పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. త్వరలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తామన్న ఆనందంతో ఉన్న మాకు పుష్కరాల్లో విధులు నిర్వహించే అవకాశం రావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
 -పి.రాంబాబు, ట్రైనీ ఎస్‌ఐ, నెల్లూరు
  మా భవితకు పునాది
 తొలి విధులు పుష్కరాలతో నిర్వహించడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. పుష్కరాల్లో తొలి అడుగు వేయడం మా పురోగతికి పునాదిగా మారుతుంది.
 - ఎ.విభూషణరావు, ట్రైనీ ఎస్‌ఐ, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement