
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ న్యాయవాది కోటేశ్వరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. డీజీపీని రాజీనామా చేయాలని న్యాయస్థానం వ్యాఖ్యానించడం బాధకలిగించిందని లేఖలో పేర్కొన్నారు. ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను లేఖలో ప్రస్తావించినట్లు న్యాయవాది తెలిపారు.
పెన్షన్ విషయంలో పంచాయతీలకు వేసిన రంగు ఖర్చు కాదన్న వ్యాఖ్యలతోపాటు.. డీజీపీపై చేసిన వ్యాఖ్యలపై ప్రచార మాధ్యమాలు ప్రచారం చేసిన వాటిని ఆధారాలుగా సీజేకు సమర్పించినట్లు వెల్లడించారు. కోర్టుల్లో విచారణ ప్రశ్నించే మాదిరిగా జరుగుతున్నాని లేఖలో పేర్కొన్నారు. తన లేఖను పిల్‌గా విచారించేందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిదని, న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపిస్తామని హైకోర్టు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment