
సాక్షి, విజయవాడ: ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సంఘటనలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం భేటీకి సంబంధించిన విషయాలపై మహమ్మద్ ఫారూక్ మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు జరుగుతున్న సంఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశాము. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణం అని ఆరోపణలు రావడం జరిగింది. (నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్)
ఈ అంశాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేశారు. దీంతో ఐజీ శంకర్ బత్ర నేతృత్వంలోని బృందాన్ని నంద్యాలకు పంపుతామని డీజీపీ తెలిపారు. పరిస్థితులను తెలపగానే వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసినందుకు ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment