![AP DGP Gowtham Sawang Strict Warnings About E Cigarettes Selling - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/26/AP-dgp.jpg.webp?itok=mggN6fQJ)
సాక్షి, అమరావతి : 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులు మాత్రమే అమ్మకాలు చేయాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం హిట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, ఈ హుక్కా వంటి వాటిపై నిషేదం ఉందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వాటి భాగాల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ నిల్వ, ప్రకటనలు నిషేదించబడ్డాయని తెలిపారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకాలు జరిపితే సంవత్సరం జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా, ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల వరకు జరిమానా పడుతుందని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ సిగరెట్లు కానీ ఈ హుక్కా కానీ అమ్మకాలు జరిగితే ప్రజలు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment