E cigarettes
-
హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో ఈ-సిగరెట్ల కలకలం
-
HYD: ఈ-సిగరెట్ల కలకలం.. విద్యార్థులే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న, కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇంటర్నేషన్ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్ చేశారు. ICFAi, IBS స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్, ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆపకపోతే చర్యలు తప్పవు.. 15 వెబ్సైట్లకు కేంద్రం నోటీసులు!
నిషేధిత ఈ-సిగరెట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ- సిగరెట్ల ప్రచారం, విక్రయాలు జరుపుతున్న వెబ్సైట్లపై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను చేపడుతున్న 15 వెబ్సైట్లకు తమ కార్యకలపాలు నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో వైపు ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు, విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, మరో ఆరు వెబ్సైట్లు కూడా పర్యవేక్షణలో ఉన్నాయని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "టేక్‌డౌన్ నోటీసులు జారీ చేసిన 15 వెబ్సైట్లలో నాలుగు కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగిలినవి ఇంకా స్పందించలేదని అధికారలు తెలిపారు. నోటీసులు అందుకున్న వెబ్సైట్ యాజమాన్యం ప్రతిస్పందించి, చట్టానికి లోబడి ఉండకపోతే, ఈ వెబ్సైట్లను తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఈ వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ ప్రకటన) చట్టం 2019లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
ఈ సిగరెట్ల అమ్మకాలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి : 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులు మాత్రమే అమ్మకాలు చేయాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం హిట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, ఈ హుక్కా వంటి వాటిపై నిషేదం ఉందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వాటి భాగాల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ నిల్వ, ప్రకటనలు నిషేదించబడ్డాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకాలు జరిపితే సంవత్సరం జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా, ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల వరకు జరిమానా పడుతుందని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ సిగరెట్లు కానీ ఈ హుక్కా కానీ అమ్మకాలు జరిగితే ప్రజలు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఈ-సిగరెట్స్‌పై నిషేధం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయవచ్చని భావిస్తున్నారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ సిగరెట్లను కలిగిఉంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ 50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. -
'సిగరెట్లు, హుక్కాకు ఇక నో..'
దిహేగ్: వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ఈ సిగరెట్లు, హుక్కాను 18 ఏళ్లలోపువారికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. భవిష్యత్ యువకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెదర్లాండ్ అధికారులు తెలిపారు. ఈ రెండు వస్తువులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఇటీవల తెలిసిందని అందుకే చాలా కఠినంగా నిషేదాజ్ఞలు అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొగాకు రహితంగా ఉండే ఈ సిగరెట్ల వాడకం ద్వారా ఆరోగ్యాన్ని కొంత రక్షించుకోవచ్చని ఇన్నాళ్లు అనుకున్నా అవన్నీ అపోహలు అని తాము తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.