'సిగరెట్లు, హుక్కాకు ఇక నో..' | Netherlands bans e-cigarettes, water pipes for under 18 | Sakshi
Sakshi News home page

'సిగరెట్లు, హుక్కాకు ఇక నో..'

Published Sun, Dec 13 2015 9:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

Netherlands bans e-cigarettes, water pipes for under 18

దిహేగ్: వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ఈ సిగరెట్లు, హుక్కాను 18 ఏళ్లలోపువారికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. భవిష్యత్ యువకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెదర్లాండ్ అధికారులు తెలిపారు.

ఈ రెండు వస్తువులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఇటీవల తెలిసిందని అందుకే చాలా కఠినంగా నిషేదాజ్ఞలు అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొగాకు రహితంగా ఉండే ఈ సిగరెట్ల వాడకం ద్వారా ఆరోగ్యాన్ని కొంత రక్షించుకోవచ్చని ఇన్నాళ్లు అనుకున్నా అవన్నీ అపోహలు అని తాము తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement