
సాక్షి, అమరావతి : ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిసవ్వటం మనసును కలిచివేస్తోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనజశ్వల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పలు కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ అవగాహన కార్యక్రమాల బ్రోచెర్‌ను విడుదల చేశారు. ( మెగాస్టార్‌కు కటింగ్ చేసిన పెద్ద కూతురు)
మెగాస్టార్ వెబినార్ ద్వారా మాట్లాడుతూ.. ‘యాంటీ డ్రగ్ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్, ఇతర అధికారులు, వెబినార్ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిష్య జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment