పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : ఏపీ డీజీపీ | AP DGP Gowtham Sawang About Godavari Floods | Sakshi
Sakshi News home page

పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : ఏపీ డీజీపీ

Published Sat, Aug 3 2019 8:54 PM | Last Updated on Sat, Aug 3 2019 9:03 PM

AP DGP Gowtham Sawang About Godavari Floods - Sakshi

సాక్షి, అమరావతి :  గోదావరికి వరదల నేపథ్యంలో పోలీస్ యంత్రాగం అప్రమత్తంగా ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్  తెలిపారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్, లోకల్ పోలీసులు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. శాటిలైట్ ఫోన్స్, డ్రోన్లతో పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ముందస్తు చర్యలలో భాగంగా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. కాగా ఇంతకు మునుపే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి వరద ఉధృతిపై ఆరా తీశారు.

ముంపు గ్రామాల్లో  చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement