
సాక్షి, అమరావతి: మంత్రి కొడాలి నానిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఆయన మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్‌కు అధికారాలు ఉంటాయని, కానీ వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడం సరికాదని పిటిషనర్ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు నిచ్చింది.
చదవండి: ఏం చేస్తావో తేల్చుకో బాబు..!
పేదలపై భారం మోపలేం..
Comments
Please login to add a commentAdd a comment