
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ఉద్యోగం ఊడిపోయే రోజున శ్రీరంగనీతులు చెబుతుంటే పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లుందని విమర్శించారు. ప్రస్తుతం నిమ్మగడ్డ లేఖను చూస్తే తాను చెప్తున్న మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదని అన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ దూరంగా ఉండాలంటాడని, కానీ! హోటల్లో సుజనా చౌదరీని కలిసి వచ్చిన ఈయన సూక్తులు చెబుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపేశాడని, కేసులు పెరిగిన తర్వాత ఎన్నికలు పెట్టాలంటాడని మండిపడ్డారు.
ఆయన తన ప్రసంగాని కొనసాగిస్తూ.. ‘‘ వాక్సినేషన్ వేస్తుంటే ఎన్నికలు నేను జరపను అని మాట్లాడారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు జరపమంటే జరిపాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు, నిమ్మగడ్డ అనుకుంటున్నారు. సాక్షాత్తు టీడీపీ కార్యాలయములో లేఖ రాయించుకుని కేంద్రానికి పంపారు. ఈ ప్రభుత్వం పనిగట్టుకుని ఆయన ఓటు ఆపినట్లు మాట్లాడుతున్నారు. తన కాపురం హైదరాబాద్ లో ఉంటున్నా ఏపీలో ఓటు కావాలంటాడు. ఆ అడ్రస్ లో ఉంటున్నట్లు ఓటు కావాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఏ కోర్ట్కు పోతే మాత్రం మీకు ఓటు ఎలా వస్తుంది. ప్రతీ దానిక ప్రభుత్వం మీద నిందలు వేయడం తగదని సూచించారు.
2016 ఏప్రిల్ 1న నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిపారో చెప్పమనండి..? .పెడన మున్సిపల్ చైర్మన్ చనిపోతే అప్పుడు ఎన్నిక ఎందుకుపెట్టలేదు..?. ఏలేరుపాడు, ఉక్కునూరుల్లో మీరే జడ్పీటీసీకీ నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు వద్దంటే ఆపేవలేదా..? ఇప్పటికైనా మీ చేతలకి పూర్తి వ్యతిరేకమైన ఇలాంటి లేఖలు రాయడం మీకు తగదు’’ అంటూ సలహా ఇచ్చారు. ( చదవండి: ఎమ్మెల్యే కానివాడు సీఎం కుర్చీ ఎక్కుతాడట!: )
Comments
Please login to add a commentAdd a comment