
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదాల నివారణపై ఉత్తరాంధ్ర అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నేవీ, పర్యాటక శాఖ, పోలీసు, ఫిషరీస్, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. మూడు జిల్లాల్లో అధికారిక.. అనధికారికంగా కొనసాగుతున్న బోట్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అనుమతులు పొందిన బోట్ల సామర్ధ్యాన్ని పరీక్షించాలన్నారు. నదులు, జలపాతాలు వద్ద ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. బోటు వినియోగంపై త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి అవంతి తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రమాదకర నదీ, సముద్ర తీరాలను గుర్తించి.. జలపాతాల వద్ద ఈతగాళ్ల నియామిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment