వైఎస్సార్‌కు నివాళులు అరి్పస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లేదని చంద్రబాబు అనడం సరికాదని..దమ్ముంటే రెఫరెండంకి సిద్ధమా అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి..ఉప ఎన్నికలకు పోదాం...అందులో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా విశాఖలో పరిపా లన రాజధానిని ఏర్పాటు చేయమన్నారు. మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడిన సహచర మంత్రిపై సిట్‌కు ఫిర్యాదు చేసిన విషయం అయ్యన్నపాత్రుడు మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాము చేస్తున్నది భూ కుంభకోణాలు కాదని...ప్రభుత్వ భూములను తీసుకుని పేద ప్రజలకు ఉగాది నాటికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. మా పార్టీ విధానం పరిపాలన వికేంద్రీకరణ అన్నారు.
అమరావతి రాజధాని అని చంద్రబాబు అంటాడు.. విశాఖ లో కొంతమంది టీడీపీ నేతలు విభేదిస్తారు..ఆ పారీ్టలో చాలా గందరగోళ పరిస్థితి ఉందని అర్థ మవుతోంది. టీడీపీకి ఒక స్టాండ్ అంటూ ఏముండదని మరోమారు స్పష్టమైందన్నారు.తమ ప్రభుత్వం సిట్ వేసిందని..మరొ కొన్ని రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తుందన్నారు. తప్పుచేసిన వారెవరైనా జైళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందేనన్నారు. టీడీపీలో చంద్రబాబుని మించి అపరమేధావిగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడని మండిపడ్డారు. ఇటీవల ఓ చంద్రబాబు అనుకూల పత్రిక సూపర్ సీఎంలని తప్పుడురాతలు రాశారని, తమ పార్టీలో ఒకరే సీఎం ..అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని....ఆయనే మాకు సూపర్ సీఎం అని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. విశాఖని పరిపాలన రాజధానిగా చేసిన మరుక్షణం నుంచి హైదరాబాద్‌కు దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు.
విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తే..కొన్ని సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతాయని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం నమ్మేస్థితిలో ప్రజ లు లేరని కియో మోటార్స్ వ్యవహారంలో మరోమారు స్పష్టమైందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విశాఖలో ఒక్క గజం భూమైనా కబ్జా జరిగిందని నిరూపిస్తే చంద్రబా బు చెప్పిదానికి తామంతా సిద్ధమని పేర్కొ న్నారు. పూటకో మాట..నిమషానికొక వేషం వేస్తున్న చంద్రబాబు తీరుపై ఆ పారీ్టలో ఉన్న ఎమ్మెల్యేలే విసుక్కుంటున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అర్హులైన వారికెవరైనా రాకపోతే తక్షణమే వచ్చే విధంగా కృషిచేయాలని కార్యకర్తలకు, వార్డు అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డు అధ్యక్షుడు, కార్యకర్త, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా..లేదా అనే విషయం తెలుసుకోవాలన్నారు.
రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. మన బలం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని, ఎప్పటికప్పుడు వలంటీర్లతో ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల మంది పేదప్రజలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నామన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్ నాయకుడు కొయ్యప్రసాద్‌రెడ్డి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కరరావు, అక్కరమాని వెంకట్రావ్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ పరూఖీ, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీ‹Ùవర్మ, పీలా వెంకటలక్ష్మీ, పీలా ఉమారాణి, పి.ఎస్.ఎన్ రాజు, బర్కత్ అలీ, షరీఫ్, బోని శివరామకృష్ణ, ఆల్ఫాకృష్ణ, బి.కాంతారావు, ఏ.రాజుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment