
సాక్షి, విశాఖపట్నం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, విఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణందాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన వాళ్లు గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో పని చేయాలని సూచించారు. దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్‌మెంట్ చేపట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment