సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆర్కె బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ పూర్తి చేశాకే ప్రారంభిస్తామని, అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని గుర్తుచేశారు. విశాఖలో మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
రుషికొండ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆస్తి పన్ను విషయంలో 15శాతానికి మించి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 350గజాలు ఉన్నవారికి రూ. 50 మాత్రమే పెరుగుతుందని తెలిపారు. బ్యాంకులుపై చెత్త వేసిన ఘటనపై కమిటీ వేశామని, దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివారస్‌రావు మాట్లాడుతూ.. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విశాఖ పరిపాలన రాజధాని, టూరిజం హబ్‌గా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment