సాక్షి, విశాఖపట్నం : జనం పేరిట చందాలు వసూలు చేసే ఖర్మ వైఎస్సార్‌సీపీకి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో హైదరాబాద్‌లో ఉండి వైఎస్సార్‌సీపీ నేతలపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉన్న వేళ పలువురు దాతలు సీఎం సహాయ నిధికి, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పేరిట చెక్కులు ఇస్తుంటే.. ఆ విషయాన్ని కూడా తెలుసుకోకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
(చదవండి : ఆ ఘటన అమానవీయం : సీఎం జగన్)
63 ఏళ్ల వయసులో ఎంపీ విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తే.. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్ట సమయంలో హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు ఏమి ఇచ్చిందని నిలదీశారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఏపీకి రావచ్చు కదా.. క్వారంటయిన్ అంటే భయమెందుకు అని ప్రశ్నించారు. షెల్టర్ హోమ్‌లో సదుపాయాలు పరిశీలిస్తే క్వారంటైన్ సెంటర్‌కి వెళ్లామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడం దారుణం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment