అవంతి శ్రీనివాస్
సాక్షి, అమరావతి : ‘ స్వామీ వివేకానందే నా నిజమైన హీరో. భారత దేశం ఉన్నంత కాలం వివేకానందుడి పేరు గుర్తుండిపోతుంద’ ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం యూత్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. దేశం బాగుంటే మనం అందరం బాగుంటామని అన్నారు. యువత కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని చెప్పారు. నాలుగు లక్షల యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. లంచం అనే మాట లేకుండా పాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. సరైన సదుపాయాలు లేక ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్ర అంటే కమెడియన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే సీఎం జగన్ తపన అని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం జగన్ ఉద్ధేశ్యమని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment