సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 82 నమోదైనట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వారిలో 56 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో బుధవారం కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసులు పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి హస్పిటల్‌లో బెడ్‌లు సిద్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలో 59 లక్షలు, సిటీలో 29 మాస్కులు పంపిణీ చేశామన్నారు. 70 క్వారంటైన్ సెంటర్లో ఇప్పటి వరకు 3231 మంది చేరగా ప్రస్తుతం 490 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రుల్లో మొత్తం 29 మంది ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. 31 కంటైన్‌మెంట్ జోన్‌లు తొలి దశంలోఉండగా తాజాగా 25 మాత్రమే ఉన్నాయన్నారు. (‘దర్శనాలు లేకపోయినా రూ.1.98 కోట్ల ఆదాయం’)
అనకాపల్లి, భీమిలి, మధురవాడ ప్రాంతాలు గ్రీన్ జోన్‌లుగా మారాయని మంత్రి పేర్కొన్నారు. వార్డు వాలంటీర్‌ల ద్వారా నాలుగు విడుతలుగా సర్వే నిర్వహించామని, కంటైన్‌మెంట్‌జోన్‌లో నిబంధనలు అమలు జరుగుతాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ విధులు నిర్వర్తించుకోవచ్చని తెలిపారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరిత గతిన వ్యాధి నుంచి బయటపడే వైద్యం ఉందన్నారు. వలస కార్మికులు ఉండాలంటే సిటీలో షెల్టర్లు ఉన్నాయని, వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లాలంటే బస్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (స్వాధార్ గృహం వాచ్‌మెన్ అరెస్టు: తానేటి వనిత)
Comments
Please login to add a commentAdd a comment