సాక్షి,విశాఖపట్నం : రాజధాని విషయంలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం దీనిపై స్పందించిన మంత్రి.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్త చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అవంతి తెలిపారు. రాజధాని అంశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించేవారు నిరూపించాలని మంత్రి సవాలు చేశారు. మద్యం రేట్లు పెంచితే టీడీపీ నాయకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రమంతా అభివృద్ధి జరగడం ఆగదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment