సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ నేత ఉదయ భాస్కర్ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. అనుమతుల్లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని అవంతి స్పష్టం చేశారు. హైవేపై పెట్రోలింగ్ జరిగినట్లే గోదావరిలో బోట్ పెట్రోలింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment