అన్నను అడ్డుపెట్టుకుని ఎదిగినవాడిని కాదని.. తాను స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిని అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సినిమా వాళ్లంటే తమకు గౌరవం ఉందని.. అయితే పవన్ భాష మాత్రం మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. లాంగ్ మార్చ్ పేరిట విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాపు యువతను పక్కదోవ పట్టించేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాటి మీటింగ్ తర్వాత పవన్ అమాయకత్వం, అపరిపక్వత పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. పవన్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయ నాయకులు కాలేరని పవన్‌కు చురకలు అంటించారు.