టీడీపీలో సీట్లు.. సిగపట్లు | Seats Conflicts in Visakhapatnam TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో సీట్లు.. సిగపట్లు

Published Tue, Mar 19 2019 1:37 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Seats Conflicts in Visakhapatnam TDP - Sakshi

గంటా ఇంట్లో భేటీ అయిన భరత్, పల్లా తదితరులు

నిన్న మొన్నటి వరకు ఎంపీ సీటు నీదేనన్నారు.. తీరా అభ్యర్థుల ప్రకటన సమయం వచ్చేసరికి తూచ్‌.. అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటు నాకివ్వాల్సిందేనని ఆ యువనేత పట్టుపడుతున్నారు..
మరోవైపు ఎమ్మెల్యే సీటు నీదే.. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారు. ఇప్పుడేమో అసెంబ్లీ కాదు.. ఎంపీగా పోటీ చేయాలని పోరు పెడుతున్నారు.. దాంతో అవాక్కయిన ఆ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. నా నియోజకవర్గానికే నన్ను పరిమితం చేయండి బాబూ.. అని మొత్తుకుంటున్నారు..

ఇదీ అధికార టీడీపీలో పరిస్థితి.. జిల్లాలో ఐదు అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లకు ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా స్థానాలు ఆశిస్తున్న నేతలు టెన్షన్‌తో నలిగిపోతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరిస్థితి చేయి దాటుతోందన్న భయంతో ఆశావహులు, అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు జిల్లా మంత్రులు చేస్తున్న మంత్రాంగం పెద్దగా ఫలించడం లేదు. ఆదివారం విశాఖ వచ్చిన చంద్రబాబు వద్దకు అటువంటి కొందరు నేతలను అయ్యన్నపాత్రుడు తీసుకెళ్లి మాట్లాడించేందుకు ప్రయత్నించినా సీఎం ఆ అవకాశం ఇవ్వలేదు. మరో మంత్రి గంటా సోమవారం తన నివాసంలో అసంతృప్త నేతలతో సమావేశమై చర్చించారు. ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేస్తానని ప్రకటించిన నరవ రాంబాబును మాత్రం ప్రస్తుతానికి ఆపగలిగారు.

సాక్షి, విశాఖపట్నం: రాని సీటు వస్తుందో రాదో తెలియదు.. నామినేషన్ల సమయం గడుస్తున్న కొద్దీ, ఆ టెన్షన్‌ ఊరికే ఉండనివ్వదు. అభ్యర్థిత్వాన్ని అధినేత ఎప్పుడు ఖరారు చేస్తారో, తమ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమీ అర్థం కాదు. సిట్టింగ్‌లకు, సీనియర్లకు సీన్‌ అర్థం కాదు. సందట్లో సడేమియాలా మంత్రులు మరేం ఫర్వాలేదంటూ ఇస్తున్న హామీల వల్ల ఆందోళన పెరుగుతుందే తప్ప ఉపశమించదు. ఇదీ ప్రస్తుతం టీడీపీలో పరిస్థితి. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పక్షం దుస్థితి. జిల్లా టీడీపీలో ఆశావహులు, సీనియర్లకు మాచెడ్డ ఇబ్బంది వచ్చి పడింది. అపార అనుభవం తన సొంతమని గొప్పలకు పోయే బాబు గారు ఏదీ తేల్చకపోవడంతో వీరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉంది. ఇదిగో అదిగో అంటూ సిట్టింగ్‌లు.. ఆశావహులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆడుకుంటున్న తీరు వారిలో కాక పుట్టిస్తోంది.

అసలే టెన్షన్‌లో ఉంటే.. ఆ ఒత్తిడి చాలదన్నట్టు మంత్రులు ఆశావహులతో ఓ రకంగా ఆడుకుంటున్నారు. మీకు సీటిప్పించే బాధ్యత మాదంటూ లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటును ఆశిస్తున్న ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు భరత్‌కు కూడా వారు ఇదే విధంగా ఊరిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ మాటా చెప్పకపోవడంతో మూర్తి అనుచరులు మండిపడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన బాబు వద్దకు తీసుకు వెళ్తానని, టిక్కెట్లు  ఇప్పించే బాధ్యత తనదని మంత్రి అ య్యన్నపాత్రుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, గవిరెడ్డి రామానాయుడుతో పాటు మి గిలిన ఆశావహులను ఊరించారు. అందుకు తగ్గ ట్టే తాను దగ్గరుండి మరీ ఎయిర్‌ పోర్టుకు తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు వీళ్ల ఆశల మీద నీళ్లు చల్లేశారు. ఆశావహుకాదుకదా.. కనీసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో మాటమాత్రంగానైనా కూడా సీఎం మాట్లాడలేదు. సీఎంను చూడగానే మంత్రి అ య్యన్న మాట్లాడే ప్రయత్నం చేయగా.. ‘చూద్దాం. ఫోన్‌లో మాట్లాడతాలే అంటూ సీఎం ఫ్లైట్‌ ఎక్కి చెక్కేశారు. దీంతో సీనియర్లమైన తమను ఇంత హీనంగా చూస్తారా అంటూ ఎమ్మెల్యేలు బండారు, కేఎస్‌ఎన్‌ఏస్‌ రాజు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే బండా రు... సీనియర్‌ ఎమ్మెల్యేనైన తనకు సీటు కేటా యింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ అ సహనం వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పరిస్థితికూడా అంతే. ఆయన కూడా టికెట్‌ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. ఎయిర్‌పోర్టులోతమకు జరిగిన అవమానాన్ని త ట్టుకోలేక మంత్రి అయ్యన్నవద్దే తమ అసహనా న్ని వ్యక్తంచేసినట్టుగా పార్టీనేతలు చెబుతున్నారు.

మరో వైపు మరోమంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం సిట్టింగ్‌లు, ఆశావహులతో బుజ్జగింపు నాటకమాడారు. తన ఇంట్లో గాజు వాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ  మూర్తి మనుమడు భరత్‌ ఇతర ఇతర ఆశావహులతో భేటీ అయ్యారు. సీఎంతో తాను మాట్లాడతానని, ఆయన దగ్గరకు తీసుకెళ్తానని కొత్తపల్లవి అందుకున్నారు. ‘మీ ఇద్దరికి మీరు కోరుకున్న సీట్లు ఇచ్చే బాధ్యత నాది.. నన్ను నమ్మండి’ అం టూ అభయమిచ్చారు.విశాఖ ఎంపీసీటు తనకు ఇవ్వాల్సిందేనని భరత్‌ పట్టుబడుతుండగా, తాను ఎంపీగా పోటీచేయనంటూ పల్లా తేల్చి చెబుతున్నారు. గాజువాకనుంచి బరిలోకి దిగనున్న పవన్‌కళ్యాణ్‌ కోసం తమ భవిష్యత్‌ను బలిచేయొద్దం టూ వారిద్దరూ మంత్రి గంటాకు తేల్చి చెప్పారు. లేదంటే తమ దారితాముచూసుకోవల్సి వస్తుం దని హెచ్చరించినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ విశాఖ ఎంపీతో పాటు భీమిలితో పాటు గాజు వాక, పెందుర్తి, మాడుగుల, చోడవరం సీట్ల పం చాయతీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది.మరో పాటు ఇప్పటికే ఖరారైన పలువురు అభ్యర్థులు సైతం తమకు బి.ఫారం చేతికి అందుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చివరి నిముషంలో మళ్లీ ఒకటి రెండు మార్పులు ఉండవచ్చునని పార్టీ అధిష్టానం నుంచిసంకేతాలు వస్తుండడంతో టికెట్‌ దక్కిన వారిలో కూడా ఆందోళన నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement