సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2019 మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పరీక్షల దరఖాస్తుకు గడువు ఈ నెల 7వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 6.10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2,835 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వాటిలో 91 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు.
పరీక్షలు సక్రమంగా జరిగేలా 150 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment