
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి చాంబర్‌లో కొద్ది నిమిషాల పాటు ఇద్దరి భేటీ సాగింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు పరిరక్షణ ఉద్యమానికి కేటీఆర్ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినట్లు గంటా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందంతో కలసి విశాఖపట్నం వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపైనా వారు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment