
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు వ్యతిరేకంగా...
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు బుధవారమిక్కడ సమావేశమయ్యారు. ప్రతి పనిలో వాసుపల్లి ముడుపులు, కమీషన్లు తీసుకుంటున్నారని, వాసుపల్లికి మళ్లీ టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు వాసుపల్లి సన్నిహితుడు కావడంతో ఆయన ఆగడాలకు అంతు లేకుండా పోతుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిందేనని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.